- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Komatireddy: తెలంగాణ ప్రజలకు ఇది అద్భుతమైన శుభవార్త
తెలంగాణ రాష్ట్ర రహదారుల నెట్‌వర్క్‌లో మరో మైలురాయి చేరబోతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రహదారుల నెట్‌వర్క్‌లో మరో మైలురాయి చేరబోతోంది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిరంతర కృషితో, దక్షిణ భాగం రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ ప్రక్రియలో ఒక కీలక ముందడుగు పడింది. మంత్రి కోమటిరెడ్డి గత ఏడాది ఆగస్టు 5న కోమటిరెడ్డి రాసిన లేఖకు సానుకూలంగా స్పందించిన కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఈ ప్రాజెక్టు పురోగతిని వివరిస్తూ ఆయనకు గురువారం ఒక అధికారిక లేఖ రాశారు. సదరన్ పార్ట్ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) రూపొందిస్తున్నట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ పనుల కోసం ఇప్పటికే ప్రత్యేక కన్సల్టెన్సీని అపాయింట్ చేశామని, నివేదిక తయారీ ప్రక్రియ కొనసాగుతోందని గడ్కరీ తన లేఖలో పేర్కొన్నారు. కేంద్రం నుంచి వచ్చిన సానుకూల స్పందన పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాము చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నందుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణకు గేమ్ చేంజర్...
శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఇది ఒక అద్భుతమైన శుభవార్తగా పేర్కొన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేయబోతోందన్నారు. ఇది తెలంగాణ అభివృద్ధికి నిజమైన గేమ్ చేంజర్ గా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ రింగ్ రోడ్డు పూర్తయితే రవాణా వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా, శివారు జిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధికి భారీ అవకాశాలు లభిస్తాయన్నారు. ఇప్పటికే ఉత్తర భాగానికి అనుమతి తెలిపి టెండర్ ప్రక్రియ కొనసాగుతున్న సందర్భంలో.. దక్షిణ భాగం పట్ల కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తెలపడంతో పూర్తి రీజినల్ రింగ్ రోడ్డు పూర్తి రింగ్ సాకారమవుతుందని మంత్రి తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఉత్తర, దక్షిణ భాగాల అనుసంధానంతో హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాలు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను పొందుతాయనీ,ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో నిరంతరం సమన్వయం చేసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు.






