- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister Jupally : నీటీ విడుదలకు కర్ణాటకకు చేరిన మంత్రి జూపల్లి బృందం
కృష్ణా, తుంగభద్ర నదుల(Krishna and Tungabhadra rivers)కు 6 టీఎంసీల నీటి విడుదల విషయంపై కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య( CM Siddha Ramaiah)తో చర్చించేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) బృందం కర్ణాటకకు చేరుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : కృష్ణా, తుంగభద్ర నదుల(Krishna and Tungabhadra rivers)కు 6 టీఎంసీల నీటి విడుదల విషయంపై కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య( CM Siddha Ramaiah)తో చర్చించేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) బృందం కర్ణాటకకు చేరుకుంది. జూపల్లితో పాటు ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్. సంపత్ కుమార్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరిల బృందం సాయంత్రం ఏడు గంటలకు సీఎం సిద్ధరామయ్యతో సమావేశం కానున్నారు.
ఉమ్మడి ఇండెంట్ తుంగభద్రా నదికి 1టీఎంసీ, కృష్ణ నదికి 5టీఎంసీల సాగు నీరు విడుదల చేస్తే అలంపూర్ ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందనుంది. ఇందుకోసం సీఎం సిద్ధరామయ్యతో మంత్రి జూపల్లి బృందం చర్చించనుంది. నారాణపూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు సాగు, తాగునీటీ అవసరాల కోసం అత్యవసరంగా 5టీఎంసీలు విడుదల చేయాలని వారు కోరనున్నారు. కృష్ణా నదికి ఐదు టీఎంసీల నీరు విడుదలయితే గద్వాల, మక్తల్, కొల్లాపూర్, వనపర్తి రైతులకు సాగునీరు అందుతుంది.
గత ఏడాది కూడా కర్ణాటక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థన మేరకు 2.25టీఎంసీల నీటిని విడుదల చేయడం జరిగింది. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే ఉండటంతో అత్యవసర సమయంలో నీటి విడుదల కోసం చేస్తు్న్న ప్రయత్నాలు ఫలిస్తుండటంతో తెలంగాణ ప్రాంత రైతులకు, ప్రజలకు ప్రయోజకరంగా మారింది. ఈ దఫా కూడా నారాయణ్ పూర్ రిజర్వాయర్ నుంచి కృష్ణా నీటి విడుదల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయని మంత్రి జూపల్లి బృందం ధీమాగా ఉంది.






