- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: సర్పంచ్ ఏకగ్రీవాలపై మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు
సర్పంచ్ ఏకగ్రీవాలపై మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: సర్పంచ్‌ల ఏకగ్రీవాలపై మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకోవడం తప్పుకాదు.. కానీ డబ్బులు పెట్టి కొనడం కరెక్ట్ కాదన్నారు. డబ్బులు పెట్టి కొంటే అది ఏకగ్రీవం కాదని.. అలా చేస్తే ప్రజాకంఠకులు అవుతారని కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బు ఉందనే అహంకారంతో ఎవరూ పదవులు కొనుగోలు చేయొద్దని సూచించారు. బలవంతపు ఏకగ్రీవాలే కాదు.. వేలం పాట ద్వారా పదవులు పొందడాన్ని కూడా తాను సమర్థించను అని అన్నారు. ఇదిలా ఉంటే.. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి నామినేషన్‌ల ప్రక్రియ శనివారం ముగిసింది. ఇవాళ్టి నుంచి రెండో విడత ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ విడతలో మొత్తం 31 జిల్లాల్లో 193 మండలాల్లో 4333 సర్పంచ్స్థానాలకు, 38350 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 14న ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు ఓట్లను లెక్కించనున్నారు.






