- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహం.. ఏర్పాట్లపై మంత్రి సమీక్ష
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

X
దిశ, రవీంద్ర భారతి/ దిశ, డైనమిక్ బ్యూరో: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam) విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ఆవరణలో SPB కాంస్య విగ్రహ ప్రతిష్టకు ప్రభుత్వం స్పీడప్ చేసింది. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి ప్రాంగణంలో ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పక్కన ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు గురువారం విగ్రహ ఏర్పాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు, నటుడు శుభలేఖ సుధాకర్ పరిశీలించారు. అనతరం విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యులు, సాంస్కృతిక శాఖ అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కవి యాకూబ్, బడేసాబ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






