తొలి తెలుగు బంజారా చారిత్రక నవలను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి

by Ajay Maddhiboyina |

తొలిసారిగా గోర్ బంజారా చరిత్రను నవలారూపంలో ఆవిష్కరించడం శుభపరిణామమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

తొలి తెలుగు బంజారా చారిత్రక నవలను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తొలిసారిగా గోర్ బంజారా చరిత్రను నవలారూపంలో ఆవిష్కరించడం శుభపరిణామమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రవీంద్రభారతి ఆవరణలోని మంత్రి చాంబర్‌లో తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన తొలి తెలుగు గోర్ బంజారా చారిత్రక నవల పోర్యతారను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ విశ్వవ్యాప్తంగా విస్తరించిన గోర్ బంజారాల ఘన చరిత్ర ఇప్పటివరకు లిఖిత రూపంలో అందుబాటులోకి రాలేదని మంత్రి పేర్కొన్నారు. వారి జీవన విధానం, సంస్కృతి, సాహసాలు, పోరాటాలను నవల రూపంలో వెలికి తీసిన రచయిత ఆమ్ గోత్ వెంకట్ పవార్‌ను అభినందించారు. ఆదివాసీగిరిజన చరిత్రలను ముద్రణలోకి తీసుకువచ్చి తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య వారసత్వాన్ని నిలబెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మైన్ డా. తేజావత్ బెల్లయ్య నాయక్, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. బాలాచారి, రచయిత వెంకట్ పవార్, దినకర్ తదితరులు పాల్గొన్నారు

Next Story