Minister Jupally: ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదు.. మంత్రి జూపల్లి ఘాటు వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కేటీఆర్‌ (KTR)కు లేదని మంత్రి జూపల్లి కృష్ణా‌రావు (Minister Jupally Krishna Rao) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Minister Jupally: ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదు.. మంత్రి జూపల్లి ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కేటీఆర్‌ (KTR)కు లేదని మంత్రి జూపల్లి కృష్ణా‌రావు (Minister Jupally Krishna Rao) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad)లోని గాంధీ‌భవన్‌ (Gandhi Bhavan)‌లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఓట్లు వేస్తేనే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. తమది ప్రజా‌పాలన అన్నారు. ప్రభుత్వ పాలనకు అడ్డుపడితే ఎంతటి వారైనా చట్ట ప్రకారం అరెస్టులు ఉంటాయని హెచ్చరించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS) ప్రజలకు ఒరగబెట్టింది ఏమి లేదని కామెంట్ చేశారు. కేటీఆర్‌ (KTR)కు ప్రజా ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. బీఆర్ఎస్ (BRS) పార్టీపై ప్రజలకు నమ్మకం పూర్తిగా పోయిందని.. ఇక ఆ పార్టీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదని తెలిపారు. చేసి అప్పులకు వడ్డీని చెల్లించేందుకు మళ్లీ అప్పులు చేశామని అన్నారు. అందుకు కారణం ముమ్మాటికీ గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు.

Next Story