- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KCR ఇంట్లో సోదాలు చేస్తే రూ.వేల కోట్లు దొరుకుతయ్.. మంత్రి సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ నేతలను, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కేసీఆరే(KCR).. గతంలో సోనియా గాంధీని దేవత అని సంబోధించాడని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) గుర్తుచేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేతలను, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కేసీఆరే(KCR).. గతంలో సోనియా గాంధీని దేవత అని సంబోధించాడని మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) గుర్తుచేశారు. ఆదివారం రాత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వెళ్లిపోయాడని మండిపడ్డారు. రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం.. రైతులపై వారికున్న ప్రేమేంటో తెలియజేస్తోందని అన్నారు. రైతుల మీద అంత ప్రేమ ఉంటే.. పదేళ్లు రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అక్షయపాత్ర లాంటి ఔటర్ రింగ్ రోడ్డును కేసీఆర్ అమ్ముకున్నాడని అన్నారు.
అధికారం పోయినా కేసీఆర్‌లో గర్వం పోలేదని విమర్శించారు. 500 మందిని వేదిక మీద కూర్చోబెట్టి కేసీఆర్ ఒక్కరే ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. నియంత నిబంధనలు ఇలాగే ఉంటాయని తెలిపారు. కేసీఆర్ నిజాయితీ పరుడు అయితే తన పార్టీకి రూ.1500 కోట్ల ఫండ్ ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సభ కోసం ప్రతి గ్రామానికి బీఆర్ఎస్ పార్టీ 3 నుంచి 4 లక్షల ఖర్చు చేసిందని అన్నారు. కేసీఆర్ హయాంలో పనిచేసిన ఇరిగేషన్ ఆఫీసర్ వద్ద రూ.100 కోట్లకు పైగా ఆస్తులు దొరికాయి.. కేసీఆర్ దగ్గర సోదాలు చేస్తే.. ఇప్పుడు కూడా వేలకోట్ల అక్రమ ఆస్తులు బయటపడతాయని సంచలన ఆరోపణలు చేశారు.






