- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
10 రోజుల డెడ్‌లైన్.. అధికారులకు మంత్రి జూపల్లి కీలక ఆదేశం
కొత్త రేషన్ కార్డులు(New Ration Cards), రైతుభరోసా(Rythu Bharosa), ఇందిరమ్మ ఇళ్ల(indiramma illu) పంపిణీపై రాష్ట్ర సచివాలయం వేదికగా అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) సమీక్షా సమావేశం నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: కొత్త రేషన్ కార్డులు(New Ration Cards), రైతుభరోసా(Rythu Bharosa), ఇందిరమ్మ ఇళ్ల(indiramma illu) పంపిణీపై రాష్ట్ర సచివాలయం వేదికగా అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ యోగ్యమైన భూములకే రైతు భరోసా అందేలా చూడాలని అన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమల్లో గ్రామ సభ నిర్ణయాలే కీలకం అని చెప్పారు. గ్రామసభలో వచ్చిన అభ్యంతరాలను 10 రోజుల్లో అధికారులు నివృత్తి చేయాలని ఆదేశించారు.
కొత్త రేషన్ కార్డులు ఇస్తున్న వేళ పాత రేషన్ కార్డులు తొలగిస్తారని వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. అది కేవలం విపక్షాల అసత్య ప్రచారం, అపోహ మాత్రమే అని అన్నారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ అనేవి నిరంతర ప్రక్రియ అని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ రైతులు(Telangana Farmers), ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతుభరోసా నిధుల విడుదల, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీన ప్రారంభించబోతోంది.
అదే రోజున అన్నదాతల అకౌంట్‌లోకి ఎకరాకు రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం జమ చేయనుంది. ఇప్పటికే రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన ప్రతీ ఎకరానికి రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రైతు భరోసా పథక మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. గత ప్రభుత్వంలో గుట్టలు, పుట్టలు, రోడ్లకు కూడా రైతుబంధు ఇచ్చారని.. కానీ ఈసారి అలా కాకుండా వ్యవసాయానికి యోగ్యమైన భూములకే, అది కూడా భూభారతిలో నమోదైన భూమికే రైతు భరోసా ఇస్తామని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.






