- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఎమ్మెల్యే మంత్రి కాబోతున్నాడు.. కుండబద్దలు కొట్టిన జూపల్లి కృష్ణారావు
మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి(Vakiti Srihari) మంత్రి కాబోతున్నాడని కుండబద్దలు కొట్టారు. మరోవైపు గతంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కూడా వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయమని మాట్లాడారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉన్నట్లు కనిపించడం లేదు. కానీ.. ఇప్పటికే నలుగురి పేర్లను అధిష్టానం ఖరారు చేసినట్లుగా అధికార పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఉమ్మడి నిజామాబాద్జిల్లా నుంచి సుదర్శన్‌రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహబూబ్‌నగర్‌జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, ఆదిలాబాద్జిల్లా నుంచి గడ్డం వివేక్‌కు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలిసింది. అయితే, చివరి నిమిషంలో ఏమైనా కొత్త పేర్లు చేరుతాయా? అనేది తెలియాల్సి ఉన్నది.






