- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్‌ను కించపరచలేదు.. కించపరచను కూడా.. రాష్ట్ర మంత్రి షాకింగ్ కామెంట్స్
తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్(KCR)ను తాను ఎప్పుడూ కించపరచలేదు.. ఇకపైన కూడా కించపరచను అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనంటే ఉద్యమం నుంచి గౌరవం ఉంది.. ఉద్యమాన్ని ముందుండి నడిపిన నాయకుడు అని అన్నారు. 1969లో 360 మంది చనిపోయినా తెలంగాణ రాలేదు.. బీజేపీ పాలనలో 3 రాష్ట్రాలు ఇచ్చారు.. కానీ తెలంగాణ ఇవ్వలేదు. సోనియాగాంధీ ఇవ్వడం వల్లే తెలంగాణ వచ్చింది. రాజకీయంగా దెబ్బతిన్నా సోనియాగాంధీయే తెలంగాణ ఇచ్చారు అని మంత్రి జూపల్లి అన్నారు. మరోవైపు.. రాష్ట్రంలో బెల్టు షాపులు పెంచిన ఘనత బీఆర్ఎస్‌దే అన్నారు. బీఆర్‌ఎస్(BRS) హయాంలో 2014లో రూ. 9,000 కోట్లు ఉన్న మద్యం ఆదాయాన్ని 2023 వరకు రూ. 34,000 కోట్లకు ఎలా పెంచిందో అందరికీ తెలుసన్నారు.
చట్టవిరుద్ధంగా బెల్ట్ షాపులను పెంచి వాటి ద్వారా అక్రమంగా మద్యం అమ్మించారని ఆరోపించారు. అంతకుముందు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో కొత్త ఎక్సైజ్ పాలసీని రద్దు చేయాలని.. ఈ ఏడాది మద్యం పాలసీ ద్వారా రూ.50వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుందని ప్రశాంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోలో బెల్ట్ షాప్‌లు మూయిస్తామని చెప్పారని.. మరి రూ.12వేల కోట్ల అదనపు ఆదాయాన్ని ఎలా సమకూరుస్తారని ప్రశ్నించారు. దీనికి జూజల్లి స్పందిస్తూ అసలు రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయం పెంచింది ఎవరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ప్రభుత్వం దిగిపోయే సమయంలోనూ రూ.39,000 కోట్లకు ఆదాయాన్ని పెంచారని.. దాని మీద తాము కేవలం రూ.4వేల కోట్లు మాత్రమే పెంచామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క శాతం కూడా టాక్స్ పెంచలేదన్నారు.






