తెలంగాణ‌లో టూరిజం కాన్‌క్లేవ్‌.. పెట్టుబడులపై మంత్రి జూప‌ల్లి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామ‌ని, ప‌ర్యాట‌కంలో పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో అత్యున్న‌త స్థాయి టూరిజం కాన్‌క్లేవ్‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప‌ర్యాట‌క, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు.

తెలంగాణ‌లో టూరిజం కాన్‌క్లేవ్‌.. పెట్టుబడులపై మంత్రి జూప‌ల్లి కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామ‌ని, ప‌ర్యాట‌కంలో పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా త్వ‌ర‌లోనే తెలంగాణ‌లో అత్యున్న‌త స్థాయి టూరిజం కాన్‌క్లేవ్‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప‌ర్యాట‌క, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) అన్నారు. శుక్రవారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC) లో జరిగిన ట్రావెల్ & టూరిజం ఫెయిర్ (TTF) 2025 ప్రారంభోత్సవంలో మంత్రి జూపల్లి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కొత్త టూరిజం పాలసీ ద్వారా పెట్టుబడుల‌కు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తోందని చెప్పారు. వివిధ వినూత్న ఆలోచనలు, ప్రాజెక్టులతో ముందుకు రావాలనుకునే యువ పారిశ్రామికవేత్తలకు ఇది విస్తృతమైన అవకాశాలను కల్పిస్తోందని తెలిపారు. టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టాలని, వారికి పూర్తిగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోనే త్వరలో ఒక ఉన్నత స్థాయి టూరిజం కాంక్లేవ్‌ను నిర్వహించనున్నట్లు ప్ర‌క‌టించారు. ఈ కార్యక్రమం చ‌ర్చ‌లకు, పెట్టుబడి ప్రణాళికలకు, వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ఒక ప్రత్యేక వేదికగా నిలుస్తుందని వెల్ల‌డించారు.

ప్రపంచస్థాయి పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని వ‌న‌రులు తెలంగాణలో ఉన్నాయ‌ని, అయితే రాష్ట్ర ప‌ర్యాట‌కానికి అనుకున్న స్థాయిలో ప్ర‌చారం ల‌భించ‌డ‌క‌పోవ‌డ‌మే అస‌లైన లోట‌న్నారు. మీరు మా రాష్ట్రాన్ని అన్వేషించే టప్పుడు, మా పర్యాటక అవకాశాలను ప్యాకేజ్ చేయటంలో భాగస్వాములు కావాల‌ని, తెలంగాణకు బ్రాండ్ అంబాసడర్లుగా నిలవాల‌ని టూరిజం, ట్రావెల్స్, హ‌స్సిటాలిటీ ఎగ్జిబిటర్లు, ప్రతినిధులకు మంత్రి పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతాయని, బ‌తుకమ్మ వేడుక‌ల‌ను చారిత్ర‌క వేయి స్తంబాల గుడి వ‌ద్ద ప్రారంభిస్తున్నామ‌ని, ఈ పూల పండుగను ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా ఆస్వాదించి, దాని వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని కోరారు.

Next Story