- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి సీతక్కకు మావోయిస్టుల హెచ్చరిక లేఖ.. జీవో నెం.49పై మంత్రి జూపల్లి క్లారిటీ
మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉట్నూరులో ఆదివాసీ(Adivasi)లతో సమావేశం అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉట్నూరులో ఆదివాసీ(Adivasi)లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీవో నెంబర్.49తో ఎవరి భూ హక్కులను వెనక్కి తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. అసలు జీవో నెం.49 ఇంకా అమల్లోకి రాలేదని చెప్పారు. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయొద్దని అధికారులను ఇప్పటికే ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. అటవీ, పర్యావరణ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఆదివాసీలకు మేలు చేసేలా సముచిత నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో కేంద్రం సహకరించేలా రాష్ట్ర బీజేపీ ఎంపీలు చూడాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపేందుకు తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు మావలలోని హరితవనాన్ని మంత్రి సందర్శించి మొక్కలు నాటారు. ముందుగా మావల హరితవనంలో లేక్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు వనంలో ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి సఫారీలో అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు.అదే విధంగా లేక్ వద్ద బైనాక్యులర్‌తో ప్రకృతి అందాలను వీక్షించారు. కాగా, ఇదే జీవోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మావోయిస్టులు మంత్రి సీతక్కకు లేఖ రాసిన విషయం తెలిసిందే.






