Phone tapping case: ఏ తప్పు చేయకపోతే కేటీఆర్, హరీశ్ రావు ఎందుకు భయపడుతున్నారు?: జూపల్లి

by Prasad Jukanti |

బీఆర్ఎస్ నేతల తీరు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటా అన్నచందంగా ఉందని ఎద్దేవా చేశారు.

Phone tapping case: ఏ తప్పు చేయకపోతే కేటీఆర్, హరీశ్ రావు ఎందుకు భయపడుతున్నారు?: జూపల్లి
X

దిశ, డైనమిక్ బ్యూరో: అధికారంలో ఉండగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కేటీఆర్, హరీశ్ రావు ఇప్పుడు తగదునమ్మా అంటూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ప్రజాభవన్‍లో మీడియాతో మాట్లాడిన జూపల్లి.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమను రాజకీయ కక్షతో వేధిస్తున్నదని కేటీఆర్, హరీశ్ రావు మాట్లాడుతున్నారని మీపై నిజంగానే కక్ష సాధింపే చేయాల్సి వస్తే మరో సెక్షన్ కింద నోటీసులు ఇచ్చి అరెస్టు చేసేవారు కదా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మిమ్మల్ని కేవలం సీఆర్ పీసీ 160 కింద సాక్షులుగా మాత్రమే నోటీసులు ఇచ్చారని నిందితులుగా పిలవలేదన్నారు. నిజంగానే ఫోన్ ట్యాపింగ్‍లో మీరు ఎలాంటి తప్పు చేయకుంటే ఎందుకు భయపడుతున్నారన్నారని నిలదీశారు. అధికారంలో ఉండగా చేయాల్సిందంతా చేసి ఇప్పుడు దిగజారి మాట్లాడితే చెల్లుబాటు కాదన్నారు. బీఆర్ఎస్ నేతల తీరు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటా అన్నచందంగా ఉందని ఎద్దేవా చేశారు.

చట్టానికి ఎవరూ అతీతులు కాదు:

నేను ఎంతో మంది ముఖ్యమంత్రులతో పని చేశానని వారి హాయంలో వినబడని ఫోన్ ట్యాపింగ్ అంశం బీఆర్ఎస్ హయాంలోనే ఎందుకు తెరపైకి వచ్చిందని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. గతంలో తమ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆకునూరి మురళి, బూరనర్సయ్య గౌడ్ వంటి వారు మాట్లాడారని చివరకు మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సైతం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించించారన్నరు. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే ప్రభాకర్ రావు అందుబాటులో లేకుండా విదేశాల్లో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అంతా చట్టప్రకారం జరుగుతోందన్నారు. చట్టం త ప్రకారం తాను చేసుకుంటూ పోతోందని చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరు పాత్రధారులు? ఎవరు సూత్రధారులు అన్నది తెలుసుకోవడం కోసమే విచారణ జరుగుతోందన్నారు. మీరు ఎన్ని అవినీతి, అప్రజాస్వామిక చర్యలు చేసిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్లుగా ఉండాలా? ప్రభుత్వం విచారణ జరిపించవద్దా అని నిలదీశారు.

Next Story