- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తోలు తీస్తా అని కేసీఆర్ కూడా అన్నారు: మంత్రి
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)పై మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌కు తెలంగాణ రైతుల ప్రయోజనాల కంటే.. రాజకీయాలే ముఖ్యమయ్యాయని అన్నారు. తెలంగాణకు 299tmc, ఏపీకి 512tmcకి ఎందుకు ఒప్పుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా జలాలను ఏపీకి దోచిపెడుతోందని కేసీఆర్ అన్నారు. తోలు తీస్తా అని కూడా కేసీఆర్ అన్నారు. వాస్తవ పరిస్థితి ప్రజలకు తెలియాలని అసెంబ్లీలో చర్చ పెట్టారు. కృష్ణా జలాలపై చర్చ పెడితే బీఆర్‌ఎస్ సభకు ఎందుకు రాలేదని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. అవినీతి బండారం బయటపడ్తుందన్న భయంతోనే అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ డుమ్మా కొట్టిందని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు నీళ్లందించడం కంటే కమీషన్లకే ప్రాధాన్యం ఇచ్చిందని మండిపడ్డారు. కమీషన్ల మీద పెట్టిన ధ్యాస.. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల మీద పెట్టలేదు. కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ మీద చూపిన ప్రేమ.. ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులపై చూపలేదు. కృష్ణా జలాల్లో ఏపీకి 512 టీఎంసీలు ఇచ్చి, తెలంగాణకు 299 టీఎంసీలే చాలు అని ఒప్పుకున్నారు.






