- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Minister Jupally: మొదట్లో కొంచెం ఇబ్బంది ఉండే.. కానీ ఇప్పుడు సెట్ అయ్యింది
బీఆర్ఎస్(BRS) నేతలు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao)లపై మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) సీరియస్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేతలు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao)లపై మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) సీరియస్ అయ్యారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం(Secretariat) వేదికగా మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ నిర్వహించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని అన్నారు. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు ఇలా అందరినీ ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే.. కనీసం రేషన్ కార్డులు కూడా ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. విద్యా రంగాన్ని, వైద్య రంగాన్ని ఎంతమేర నిర్వీర్యం చేయాలో.. అంతమేర నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఏ వ్యవస్థలోనూ మార్పు తీసుకురాలేకపోయారని విమర్శించారు.
రాష్ట్ర రైతుల గురించి మాట్లాడే కనీస అర్హత కూడా ఆ పార్టీ నేతలకు లేదని మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఫార్మా సిటీ(Pharma City) ఉంటే కొడంగల్(Kodangal)లో ధర్నా ఎందుకు? అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. అసలు కొడంగల్‌లో కేటీఆర్ ధర్నా ఎందుకు చేశారో ఆయనకైనా తెలుసా? అని అడిగారు. పదేళ్లు అవినీతి, అక్రమాలు జరగలేవా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు తప్ప చేసింది ఏమీలేదని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన మొదట్లో ఆర్థికంగా కొంత ఇబ్బంది అయినా.. ఇప్పుడు సెట్ అయిందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.
కాగా, సోమవారం కేటీఆర్ కొడంగల్‌లో పర్యటించారు. కోస్గిలో జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇక్కడి ప్రజలు మా ఎమ్మెల్యే సీఎం అయితే మాకు మంచి చేస్తారని అనుకున్నారన్నారు. రేవంత్ రెడ్డి ప్రజల కోసం పనిచేయడం లేదని, భూములు గుంజుకో వడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రజల కోసం పనిచేయడం లేదని, అన్నదమ్ములు, అదానీల కోసమే పనిచే స్తున్నారన్నారు. రూ.కోట్లు దోచిపెట్టేందుకే పనిచేస్తున్నారని మండిపడ్డారు.






