డ్రైవర్ నిర్లక్ష్యం.. బస్సు ప్రమాదంపై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2025-10-24 12:40:34  IST  )

కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనా స్థలిని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సందర్శించారు.

డ్రైవర్ నిర్లక్ష్యం.. బస్సు ప్రమాదంపై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనా స్థలిని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) సందర్శించారు. ప్రమాదంపై గద్వాల జిల్లా కలెక్టర్‌ను మంత్రి అడిగి తెలుసుకున్నారు. సహాయ చర్యల వివరాలు మంత్రి జూపల్లి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై మంత్రి జూపల్లి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఈ దుర్ఘటనలో డ్రైవర్ నిర్లక్ష్యం ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారని తెలిపారు. డ్రైవర్లను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్ల మీద చర్యలు తప్పకుండా తీసుకోవాలని అన్నారు. ఘటనలపై బాధ్యత వహించి.. బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత యాజమానులపై ఉందని వెల్లడించారు. ఇక, ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆరుగురు ప్రయాణికులు మరణించగా, పది మంది ప్రమాదం నుంచి బయట పడ్డారని, కొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు. వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పుకొచ్చారు. బైక్ ఢీకొన్న వెంటనే బస్సును ఆపి ఉంటే ప్రమాద తీవ్రత తక్కువగా ఉండేదని అభిప్రాయపడ్డారు. వివరాల కోసం..

కాగా, శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద బైక్‌ను ఢీకొట్టి, ఘోర అగ్నిప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 21 మంది సజీవ దహనం కాగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

Next Story