వాటిని ప్రపంచానికి పరిచయం చేయాల్సిన బాధ్యత మనదే.. అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశం

by Gantepaka Srikanth |

తెలంగాణ సంస్కృతి, చారిత్రక వైభ‌వం చాటి చెప్పేలా మిస్ వ‌ర‌ల్డ్ పోటీల‌ను నిర్వ‌హించాలని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అధికారుల‌ను ఆదేశించారు.

వాటిని ప్రపంచానికి పరిచయం చేయాల్సిన బాధ్యత మనదే.. అధికారులకు మంత్రి జూపల్లి ఆదేశం
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సంస్కృతి, చారిత్రక వైభ‌వం చాటి చెప్పేలా మిస్ వ‌ర‌ల్డ్ పోటీల‌ను నిర్వ‌హించాలని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అధికారుల‌ను ఆదేశించారు. గురువారం బేగంపేట‌లోని టూరిజం ప్లాజాలో ప్ర‌పంచ సుంద‌రి పోటీల నిర్వ‌హ‌ణ‌పై మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు. తెలంగాణ ప‌ర్యాట‌క ప్రాంతాలు, ఆధ్మాత్మిక క్షేత్రాలు, చారిత్ర‌క క‌ట్ట‌డాల‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసే వేదిక‌గా అందాల పోటీల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని దిశానిర్ధేశం చేశారు.

విదేశీ ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్శించ‌డం ద్వారా ప‌ర్యాట‌క రంగ అభివృద్ధి త‌ద్వారా ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు పెర‌గ‌డంతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20కి పైగా వేదిక‌ల్లో వివిధ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేసిన‌ట్లు అధికారులు వివ‌రించారు. వివిధ వేదిక‌ల్లో వేడుక‌లు నిర్వ‌హిస్తున్నందున ఆయా ప్ర‌భుత్వ విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని, జిల్లా క‌లెక్ల‌ర్లు, ఎస్పీలు, ఇత‌ర‌ అధికార యంత్రాంగం సమిష్టిగా ప‌ని చేయాల‌ని సుచించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌జ‌ల‌ను ఇందులో భాగాస్వాముల‌ను చేయాల‌న్నారు. ఈ స‌మీక్ష‌లో ప‌ర్యాట‌క శాఖ సెక్ర‌ట‌రీ స్మితా స‌బ‌ర్వాల్, ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థ ఎండీ ప్ర‌కాష్ రెడ్డి, ప‌ర్యాట‌క శాఖ డైరెక్ట‌ర్ జెండాగే హనుమంత్ కొండిబా, క్రీడా ప్రాధికార సంస్థ ఎండీ సోని బాల‌దేవి, యుజ‌వ‌న స‌ర్వీసుల శాఖ డైరెక్ట‌ర్ వాసం వెంక‌టుశ్వ‌ర్లు, భాషా, సాంస్కృతిక శాఖ సంచాల‌కులు మామిడి హ‌రికృష్ణ‌, నిర్వ‌హ‌కులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

ప్రపంచం ఎంత శరవేగంగా అభివృద్ధి చెందుతుంటే అంతే వేగంతో ఆతిథ్య, టూరిజం రంగాలు కూడా వృద్ధి చెందుతున్నాయ‌ని జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పుష్క‌లంగా ఉన్నాయ‌ని తెలిపారు. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ (నిథిమ్‌)లో యూరోపియ‌న్ యూనియ‌న్ స‌హాకారంతో నిథిమ్ ఆద్వ‌ర్యంలో న‌డుస్తున్న సిపాస్ ప్రాజెక్ట్ కు సంబంధించిన‌ టూరిజం స్టేక్‌హోల్డర్స్ వర్క్‌షాప్‌ను మంత్రి జూప‌ల్లి కృష్ణారావు లాంఛ‌నంగాప్రారంభించారు. అనంత‌రం సిపాస్ వెబ్ సైట్‌ను ఆవిష్కరించారు. యూరోపియన్ ప్రాజెక్ట్‌ను అమలు చేయడానికి చొరవ తీసుకున్నందుకు నిథమ్ డైరెక్టర్ జెండాగే హనుమంత్ కొండిబాను మంత్రి జూప‌ల్లి అభినందించారు.

Next Story