TG: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ అప్‌డేట్

by Gantepaka Srikanth |

జనవరి నెలాఖరు కల్లా మున్సిపల్ ఎ్ననికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని మంత్రి లక్ష్మణ్ స్పష్టం చేశారు.

TG: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ అప్‌డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేతలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Laxman Kumar) తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బీజేపీపై వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం లేకనే ఉపాధి హామీ పథకంపై చర్చకు దూరంగా బీఆర్ఎస్ పారిపోయిందని విమర్శించారు. మా తప్పు ఉంటే అసెంబ్లీకి వచ్చి నిరూపించండని సవాల్ చేశారు. మూసీ అంశంలో రన్నింగ్ కామెంటరీ చేశారని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయందని.. ఉనికి కాపాడుకునేందుకే ఇప్పుడు తెగ ఆరాటపడుతోంది.. బీజేపీతో దోస్తీ చేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ల పాటు ఒక్క ఎమ్మెల్యేకు కూడా కేసీఆర్ గౌరవం ఇవ్వలేదని అన్నారు. ‘ఈ నెలాఖరు కల్లా మున్సిపాలిటీల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి నెలలో ఎన్నికలు ఉండొచ్చు. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల విద్యార్థులకు వేడి నీళ్లకోసం సోలార్ పవర్ ద్వారా పెట్టించడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చాం’ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు.

Next Story