రెండున్నర ఏళ్లలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం.. మంత్రి దామోదర కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-01-31 10:45:01  IST  )

రానున్న రెండున్నర ఏళ్లలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ..

రెండున్నర ఏళ్లలో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం.. మంత్రి దామోదర కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్/హిమాయత్ నగర్: రానున్న రెండున్నర ఏళ్లలో ఉస్మానియా ఆసుపత్రి(Osmania Hospital) నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. హైదరాబాద్ గోషామహల్ పోలీస్ గ్రౌండ్‌(Hyderabad Goshamahal Police Ground)లో ఉస్మానియా ఆస్పత్రి భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త ఉస్మానియా ఆసుపత్రిలో మొత్తం 40 డిపార్ట్‌మెంట్ల సేవలు పేషంట్లకు అందుబాటులో ఉండనున్నాయని చెప్పారు. మారుమూల ప్రాంతం నుంచి పేదవాడు ఏ ట్రీట్మెంట్ కోసం ఉస్మానియాకు వచ్చినా అది లేదు అనకుండా వైద్య సేవలు అందిస్తామన్నారు. రూ.2700 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో, అంతర్జాతీయ స్థాయిలో ఆసుపత్రిని నిర్మిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. అన్ని కలిసి రావడంతో రాబోయే కాలంలో కల సాకారం కాబోతోందన్నారు. ఎవరు ఉస్మానియాకు వచ్చినా అన్ని సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాజనర్సింహ తెలిపారు.

కాగా పేదలకు మరిన్ని వైద్య సేవలు అందించేందుకు కొత్తగా ఉస్మానియా ఆస్పత్రిని నిర్వమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారు. తాజాగా అమల్లోకి తీసుకొచ్చారు. గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌లో ఆస్పత్రికి నిర్మించేందుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు పాల్గొన్నారు.

Next Story