Pamela Satpathy: కలెక్టర్ పమేలా సత్పతి త్వరగా కోలుకోవాలి.. మంత్రి దామోదర ట్వీట్

by Ramesh Naini |

కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి (Pamela Satpathy) ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు.

Pamela Satpathy: కలెక్టర్ పమేలా సత్పతి త్వరగా కోలుకోవాలి.. మంత్రి దామోదర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి (Pamela Satpathy) ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. సైనస్ సమస్యతో పాటు తీవ్ర తలనొప్పితో ఆదివారం ఉదయం ఆమె ఆసుపత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు ముక్కులో ఎముక పెరగడంతో శస్త్రచికిత్స చేశారు. అయితే ప్రభుత్వాస్పత్రిలో వైద్యం చేయించుకుని, ఆదర్శంగా నిలిచారని కలెక్టర్ పమేలా‌సత్పతిని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodar Raja Narasimha) అభినందించారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఎక్స్ వేదికగా వార్తను పోస్ట్ చేశారు. కరీంనగర్‌లోని సర్కారు దవాఖానలో కలెక్టర్ పమేలా సత్పతి ఆపరేషన్ చేయించుకున్నారని తెలిపారు.

గత కొంతకాలంగా (Sinus) సైనస్, తలనొప్పితో కలెక్టర్ బాధపడుతున్నారని వివరించారు. కరీంనగర్ జనరల్ హాస్పిటల్ ఈ‌ఎన్‌టీ (ENT) డాక్టర్ల బృందం సక్సెస్‌ఫుల్‌గా ఆపరేషన్ చేసి, ఆమెకు ఉపశమనం కలిగించారని వైద్యులను అభినందించారు. కలెక్టర్ పమేలా సత్పతి త్వరగా కోలుకోవాలని‌ మంత్రి ఆకాంక్షించారు. అలాగే కలెక్టర్‌ సర్కారు దవాఖానలో చికిత్స చేయించుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. వీరి ట్వీట్ వైరల్ కావడంతో కలెక్టర్ (pamela satpathi) త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ఆకాంక్షించారు.

Next Story