సీజనల్ కేసులు నమోదు రహిత రాష్ట్రంగా నిలవాలి.. అధికారులకు ఆరోగ్య మంత్రి ఆదేశాలు

by Ramesh Naini |

సీజనల్ కేసుల నమోదు రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా ఆదేశించారు.

సీజనల్ కేసులు నమోదు రహిత రాష్ట్రంగా నిలవాలి.. అధికారులకు ఆరోగ్య మంత్రి ఆదేశాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: (seasonal diseases) సీజనల్ కేసుల నమోదు రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా (Minister Damodar Rajanarsimha) ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని రాజీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో సీజనల్ వ్యాధుల నివారణ పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మంత్రి రాజనర్సింహ పాల్గొన్నారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణ పై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రదర్శనను మంత్రి పరిశీలించారు. రాష్ట్రంలో అన్ని ఆసుపత్రులలో సీజనల్ రోగాలకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని సమీక్షలో మంత్రి ఆరోగ్య అధికారులు వివరించారు.

సీజనల్ వ్యాధులు పూర్తి నియంత్రణలో ఉన్నాయని వివరించారు. గత సంవత్సరంతో పోలిస్తే సీజనల్ వ్యాధుల కేసులు తగ్గుముఖం పట్టాయని సమీక్షలో డైరెక్టర్ అఫ్ హెల్త్ డా. రవీందర్ కుమార్ వెల్లడించారు. సీజనల్ వ్యాధుల కట్టడి పై ఆరోగ్య శాఖ అధికారులు క్షేత్ర స్థాయి లో పర్యటించి ప్రజల్లో అవగాహన ను కల్పించామని వెల్లడించారు. సమీక్షలో రాష్ట్ర వైద్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్ చోంగ్తూ, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ ఉదయ్ కుమార్, డీఎంఈ డా. నరేంద్ర కుమార్, డైరెక్టర్ అఫ్ హెల్త్ డా. రవీందర్ కుమార్, టీవివిపి కమిషనర్ డా. అజయ్ కుమార్ , స్పెషల్ ఆఫీసర్ విమలా థామస్‌లు పాల్గొన్నారు .

Next Story