- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ మత్తు టాబ్లెట్స్ అమ్మే వారిని పట్టుకోండి.. మంత్రి ఆదేశం
డ్రగ్ కంట్రోల్ అథారిటీ(Drug Control Authority) అధికారులతో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్(Minister Damodar Rajanarasimha) రాజనర్సింహా సమీక్ష నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్ కంట్రోల్ అథారిటీ(Drug Control Authority) అధికారులతో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్(Minister Damodar Rajanarasimha) రాజనర్సింహా సమీక్ష నిర్వహించారు. 2024 & 2025లో డీసీఏ వర్క్ ప్రోగ్రెస్‌ను మంత్రికి డీసీఏ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసీం వివరించారు. 2024లో 25,939 తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన 4142 సంస్థలపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. 2025లో జనవరి నుంచి జూలై వరకు 16,481 తనిఖీలు చేశామని, నిబంధనలు ఉల్లంఘించిన 2827 సంస్థలపై చర్యలు తీసుకున్నామన్నారు. 2024 జనవరి నుంచి 2025 జూలై వరకు 7200 మెడిసిన్ సాంపిల్స్‌ను టెస్ట్ చేయగా, అందులో 186 నాసిరకం (Not Standard Quality) మెడిసిన్‌గా తేలిందని, సంబంధిత సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నామన్నారు.
సుమారు 700 కేసులు బుక్ చేశామని వివరించారు. ప్రతి కేసులోనూ దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జనాలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తూ, మెడిసిన్ అమ్మకాలు జరుపుతున్న కంపెనీలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. స్పూరియస్, నాట్ స్టాండర్డ్ డ్రగ్స్ తయారు చేస్తున్న ఫార్మా కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, అమ్మకందారులపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. మెడిసిన్ అనేది ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశం అని, ఈ విషయంలో ఎలాంటి ఉపేక్ష పనికిరాదన్నారు. పదే పదే నిబంధనలు ఉల్లఘింస్తున్న సంస్థలను చట్టప్రకారం పర్మినెంట్‌గా క్లోజ్ చేయాలని ఆదేశించారు.
నకిలీ, నిషేధిత మందుల తయారీ, అమ్మకం దారులపై అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని మంత్రి ఆదేశించారు. మెడిసిన్‌ను ఆహార పదార్థాలుగా చూపిస్తూ, వాటి తయారీ, అమ్మకాలు చేపడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. యాంటిబయాటిక్ రెసిస్టెన్స్ అనేది పెద్ద ముప్పుగా పరిణమిస్తోందని, నిబంధనలు ఉల్లంఘించి యాంటిబయాటిక్స్ అమ్మకాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు ప్రేరేపిత మెడిసిన్ అమ్మకాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీసీఏ డీజీని మంత్రి ఆదేశించారు.
డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ అప్‌గ్రెడేషన్ పనులను స్పీడప్ చేయాలని మంత్రి ఆదేశించారు. త్వరలో మరిన్ని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను మంజూరు చేసి, రిక్రూట్ చేస్తామని.. తద్వారా డ్రగ్ కంట్రోల్ అథారిటీని మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ప్రజలకు క్వాలిటీ మెడిసిన్, క్వాలిటీ ఫుడ్ అందించే విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.






