Health scheme: గుడ్‌ న్యూస్.. ఉద్యోగుల‌కు త్వ‌ర‌లోనే నూత‌న ఆరోగ్య ప‌థ‌కం! : మంత్రి దామోదర హామీ

by Ramesh Naini |

తెలంగాణలో ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Health scheme: గుడ్‌ న్యూస్.. ఉద్యోగుల‌కు త్వ‌ర‌లోనే నూత‌న ఆరోగ్య ప‌థ‌కం! : మంత్రి దామోదర హామీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో (employee health scheme) ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. తొందరలోనే పథకంపై నిర్ణయం తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఈ పథకంపై ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ (Health Minister Damodar Rajanarsimha) స్పష్టం చేశారు. ఇవాళ (శనివారం) సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, ఇతర సభ్యులు మంత్రిని కలిశారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమలుకు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

ఈ సందర్భంగా ఉద్యోగుల‌కు త్వ‌ర‌లోనే నూత‌న ఆరోగ్య ప‌థ‌కం తీసుకరాబోతున్నట్లు మంత్రి దామోదర హామీ ఇచ్చారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులకు సంబంధించన నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 26,519 మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరటనిస్తూ, మొత్తం రూ. 180.30 కోట్ల విలువైన వైద్య బిల్లుల బకాయిలకు సంబంధించిన నిధులను విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.

Next Story