మరొకరు ఇలాంటి పని చేయాలంటే వెన్నులో వణుకు పుట్టాలి.. హెల్త్ మినిస్టర్ సంచలన ఆదేశం

by Gantepaka Srikanth |

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్(Saroornagar) అలకనంద ఆసుపత్రి(Alaknanda Hospital) ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.

మరొకరు ఇలాంటి పని చేయాలంటే వెన్నులో వణుకు పుట్టాలి.. హెల్త్ మినిస్టర్ సంచలన ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని సరూర్‌నగర్(Saroornagar) అలకనంద ఆసుపత్రి(Alaknanda Hospital) ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఆసుపత్రిలో ఇన్నాళ్లు గుట్టుచప్పుడు కాకుండా జరిగిన కిడ్నీ మార్పిడీ దందాను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. మొత్తం ప్రైవేటు హాస్పిటల్స్‌లో ఇలాంటి వ్యవహారాలపై విచారణ కోసం కేసు‌ను సీఐడీ(CID)కి అప్పగించించింది. ఈ మేరకు శుక్రవారం అధికారులు హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజరనర్సింహా(Minister Damodar Raja Narasimha) ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోందని మంత్రి పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని, ఈ రాకెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరినీ పట్టుకోవాలని ఆదేశాల్లో మంత్రి పేర్కొన్నారు. దోషులకు చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరొకరు ఇలాంటి పని చేయాలంటే వణికిపోయేలా చర్యలుంటాయని హెచ్చరించారు.

Next Story