- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Minister: తెలంగాణ తల్లిని చూస్తుంటే మా నాయనమ్మ గుర్తొచ్చింది.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ తల్లి(Telangana Thalli) విగ్రహ రూపంపై మంత్రి దామోదర రాజనర్సింహా(Damodar Raja Narasimha) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ తల్లి(Telangana Thalli) విగ్రహ రూపంపై మంత్రి దామోదర రాజనర్సింహా(Damodar Raja Narasimha) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహా ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అసెంబ్లీలో చేసిన ప్రకటనపై మంత్రి దామోదర రాజనర్సింహా(Damodar Raja Narasimha) కృతజ్ఞతలు తెలిపారు. పట్టుదలకు, తెగింపునకు ప్రతిరూపం ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలన్నారు. రాష్ట్ర ఏర్పాటులో కవులు, కళాకారుల పాత్ర మరవలేనిదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా కూడా సోనియా గాంధీ(Sonia Gandhi) తెలంగాణ ఇచ్చారని గుర్తుచేశారు. డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం శుభపరిణామం అన్నారు.
ఉద్యమ సమయంలో తెలంగాణ ఏర్పాటు ఎంత అనివార్యమో.. UPA ప్రభుత్వ పెద్దలకు, UPA అధినేత్రి సోనియా గాంధీకి 45 నిమిషాలు సుదీర్ఘంగా వివరించే అవకాశం నాకు దక్కడం ఎంతో గర్వంగా ఉందన్నారు. అంతేకాదు.. ఈ సందర్భంగా సోనియాగాంధీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసినప్పుడల్లా మా నాయనమ్మ, మా అమ్మమ్మలు గుర్తొచ్చారని మంత్రి దామోదర రాజనర్సింహా వెల్లడించారు. తెలంగాణ తల్లి విగ్రహా రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.






