రూపురేఖలు మారడం ఖాయం.. CM రేవంత్ పర్యటనలపై మంత్రి దామోదర కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పర్యటన నేపథ్యంలో సంగారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Raja Narasimha) సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

రూపురేఖలు మారడం ఖాయం.. CM రేవంత్ పర్యటనలపై మంత్రి దామోదర కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పర్యటన నేపథ్యంలో సంగారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Raja Narasimha) సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహా మాట్లాడుతూ.. ఈ నెల 23వ తేదీన సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన చారిత్రాత్మకం కావాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో సంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో రూపురేఖలు మారుతాయన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో సీఎం పర్యటన విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు సీఎం పర్యటన కోసం రూట్ మ్యాప్ ప్రణాళిక, సెక్యూరిటీ, బందోబస్తు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, హెలిప్యాడ్, హెల్త్ క్యాంప్‌లు పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు.

ముఖ్యమంత్రి పర్యటనలో బసవేశ్వర విగ్రహావిష్కరణ, కేంద్రీయ విద్యాలయ నూతన భవనం ప్రారంభోత్సవం, మహిళా పెట్రోల్ బంకు, జిల్లా అభివృద్ధికి కావలసిన కొన్ని కార్యక్రమాలను శంకుస్థాపనలు చేసి, వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఏర్పాటు చేసిన స్టాల్‌లను పరిశీలించి సభలో పాల్గొంటారని తెలిపారు.

జహీరాబాద్ ఎంపీ సురేష్ శేఖర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జిల్లాకు రావడం చాలా సంతోషమని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జహీరాబాద్ నియోజకవర్గానికి ఎన్నో పరిశ్రమలను తీసుకువచ్చి, ప్రజలందరికీ ఉపాధి కల్పించిందని గుర్తుచేశారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు క్రాంతి, సంజీవరెడ్డి మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలని పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story