- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Raja Narasimha: ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు భరోసా కల్పించాలి
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెరిగేలా మెరుగైన సేవలు అందించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా దిశానిర్దేశం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పెరిగేలా మెరుగైన సేవలు అందించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా దిశానిర్దేశం చేశారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహా అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ప్రభుత్వ ఆసుపత్రుల బ్రాండింగ్‌పై శాఖ కార్యదర్శి డా. క్రిస్టినా పవర్ పాయింట్ ద్వారా చేపట్టే అంశాలను వివరించారు. అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 202 ప్రభుత్వ ఆసుపత్రులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లోని 100 పడకల పైన ఉన్న ఆస్పత్రుల (40)ను దశలవారీగా బ్రాండింగ్ చేయాలని మంత్రి వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు ఓపీ, ఐపీ పెంచాలన్నారు. సర్జరీలను సకాలంలో అందించాలన్నారు. సామాన్యులకు ప్రభుత్వ ఆసుపత్రులలో నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలు అందిస్తారని భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ బ్రాండింగ్ కార్యక్రమాన్ని రూపొందించినట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహా అధికారులకు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజల అవసరాలకు ఆనుగుణంగా బెడ్‌ల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, ఎక్విప్మెంట్(సిటీ, ఎంఆర్ఐ)లను సమకూర్చడం, బ్లడ్ బ్యాంకుల ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న బ్రాండింగ్ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా ఫైర్ సేఫ్టీ, ఎలక్ట్రికల్ సేఫ్టీ, డ్యూటీ రూమ్, సీసీటీవీల పర్యవేక్షణ, సెక్యూరిటీ అవుట్ పోస్టుల ఏర్పాటు, రెడ్ అలారం సిస్టంలను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు అవసరమైన సౌకర్యాల కల్పనలో భాగంగా ఐపీ. ఓపీ విభాగాలకు వచ్చే పేషెంట్లకు టాయిలెట్ బ్లాక్ లను ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రిలో స్ట్రక్చరల్ రిపేర్లు, వివిధ విభాగాలకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లు, సైనేజ్ బోర్డులు, అంతర్గత రోడ్లు, కాంపౌండ్ వాల్ నిర్మాణాలు చేపట్టాలన్నారు.
ఆస్పత్రిలో క్యాంటీన్, మంచినీటి సౌకర్యం, పేషంటు వెంట వచ్చే అటెండర్ల సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించాలన్నారు. ఆసుపత్రులలో ప్రత్యేకంగా రిసెప్షనిస్టు, కామన్ ఏరియా, బయో మెడికల్ వేస్టేజీ, ల్యాండ్ స్కేపింగ్‌లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆస్పత్రులలో పరిపాలన విభాగాన్ని ఏర్పాటు చేసి కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా అధికారులను ఆదేశించారు. వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును పరిశీలించి వచ్చిన వైద్యశాఖ అధికారులు ఆయా రాష్ట్రాలలో ఆసుపత్రుల పనితీరు నివేదికను మంత్రి దామోదర్ రాజనర్సింహాకి వివరించారు.
తెలంగాణలో వైద్య సేవలు దేశంలో వివిధ రాష్ట్రాల కు ఆదర్శంగా నిలిచేలా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, ఎక్విప్మెంట్‌లను ఆసుపత్రులకు సమకూర్చి వైద్య సేవల బలోపేతానికి నిర్దిష్టమైన విధానాలను రూపొందించి అమలు చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా అధికారులకు సూచించారు.






