‘ఎవరికీ ఏం కాలేదు.. అంతా సేఫ్’.. నిమ్స్ అగ్ని ప్రమాదంపై మంత్రి దామోదర స్పందన

by Gantepaka Srikanth |

నిమ్స్ ఆసుపత్రి(NIMS Hospital) అగ్నిప్రమాదంపై మంత్రి దామోదర్ రాజనర్సింహా(Damodar Raja Narasimha) స్పందించారు.

‘ఎవరికీ ఏం కాలేదు.. అంతా సేఫ్’.. నిమ్స్ అగ్ని ప్రమాదంపై మంత్రి దామోదర స్పందన
X

దిశ, వెబ్‌డెస్క్: నిమ్స్ ఆసుపత్రి(NIMS Hospital) అగ్నిప్రమాదంపై మంత్రి దామోదర్ రాజనర్సింహా(Damodar Raja Narasimha) స్పందించారు. నిమ్స్ డైరెక్టర్‌కు ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నారు. అగ్ని ప్రమాద ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని చెప్పారు. ఆస్తి నష్టం కూడా పెద్దగా జరుగలేదని అన్నారు. వేసవికాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే ముప్పు ఉంటుందని తెలిపారు. ఇలాంటి సమయాల్లో అధికారులు, ఆసుపత్రి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పేషెంట్లందరినీ సేఫ్ ప్లేస్‌లోకి తరలించినట్లు చెప్పారు.

కాగా, శనివారం మధ్యాహ్నం పంజాగుట్ట నిమ్స్‌ ఆస్పత్రి అత్యవసర వైద్య విభాగంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఐదో అంతస్తులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. కిటికీల నుంచి దట్టమైన పొగలు బయటకు రావడంతో అక్కడున్న పేషెంట్లతో పాటు సిబ్బందికూడా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలు అదుపు చేశారు.

Next Story