- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సరోగసిని వ్యాపారంగా మార్చి దందా.. ఆరోగ్యశాఖకు మంత్రి కఠిన ఆదేశాలు
మాతృత్వం కోసం తపిస్తున్న దంపతుల ఆశను ఆసరాగా చేసుకుని, ఐవీఎఫ్, సరోగసిని వ్యాపారంగా మార్చి దందాకు పాల్పడుతున్న ఐవీఎఫ్ సెంటర్ల(IVF Centers)పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ(Department of Health) ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహా(Damodar Raja Narasimha) ఆదేశించారు.

దిశ, వెబ్‌డెస్క్: మాతృత్వం కోసం తపిస్తున్న దంపతుల ఆశను ఆసరాగా చేసుకుని, ఐవీఎఫ్, సరోగసిని వ్యాపారంగా మార్చి దందాకు పాల్పడుతున్న ఐవీఎఫ్ సెంటర్ల(IVF Centers)పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ(Department of Health) ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహా(Damodar Raja Narasimha) ఆదేశించారు. సృష్టి తరహా ఘటనలు పునరావృతం అవకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐవీఎఫ్ క్లినిక్‌లలో తనిఖీలు, నియంత్రణ కోసం ఉన్నతాధికారులతో కమిటీని నియమించాలని హెల్త్ సెక్రటరీకి మంత్రి సూచించారు. ఈ మేరకు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ నేతృత్వంలో ఆరోగ్యశ్రీ సీఈవో, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ సభ్యులుగా కమిటినీ నియమిస్తూ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ నేతృత్వంలో ప్రైవేటు ఐవీఎఫ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించనున్నారు. ఆయా సెంటర్లపై ఇదివరకే నమోదైన కేసుల వివరాలు సేకరించనున్నారు. ఆయా సెంటర్ల అనుమతులు, రిజిస్ట్రేషన్ల వ్యాలిడిటీ వంటి అంశాలను పరిశీలించనున్నారు. ఈ ప్రక్రియను పది రోజుల్లో పూర్తి చేసి, నివేదిక అందించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.






