రాజకీయం చేసి.. వ్యక్తిత్వం దిగజార్చుకోకండి ప్లీజ్.. ప్రతిపక్షాలకు మంత్రి దామోదర విజ్ఞప్తి

by Gantepaka Srikanth |

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడ(Pashamylaram Industrial Area)లో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే.

రాజకీయం చేసి.. వ్యక్తిత్వం దిగజార్చుకోకండి ప్లీజ్.. ప్రతిపక్షాలకు మంత్రి దామోదర విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడ(Pashamylaram Industrial Area)లో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్(Reactor) పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. మంటల్లో చిక్కుకుని 13 మంది చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి వచ్చి మంత్రి దామోదర రాజనర్సింహా(Damodar Raja Narasimha) పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘జరిగిన ఘటన బాధాకరం.. దురదృష్టకరం. ఘటన జరిగిన వెంటనే పోలీస్, ఫైర్ సహా అన్ని డిపార్ట్‌మెంట్లు వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టాయి. మూడు అంతస్తుల భవనం కూలిపోయింది. ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాద సమయంలో పరిశ్రమలో సుమారు 65 మంది పనిలో ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నాం. వారికి పూర్తి చికిత్స ఉచితంగా అందించే బాధ్యత మా ప్రభుత్వానిదే. ఇప్పటివరకు 13 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ప్రతి కార్మికుని కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత, ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వానిది. ఇలాంటి దుర్ఘటనలను రాజకీయం చేసి, వ్యక్తిత్వం దిగజార్చుకోవద్దని ప్రతిపక్షాలకు మంత్రి దామోదర రిక్వెస్ట్ చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో అందరం బాధితులకు అండగా ఉండాలి. అది మన బాధ్యత అని గ్రహించాలని అన్నారు. ఇదిలా ఉంటే.. పాశమైలారం దుర్ఘటనలో గాయపడిన వారు పఠాన్‌చెరు(Pathancheru)లోని దృవ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మరికాసేపట్లో వారిని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా పరామర్శిస్తారు.

Next Story