జీవన్ రెడ్డి పార్టీ మారబోడు అనే ఆశతో ఉన్నాం: మంత్రి అడ్లూరి

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జీవన్ రెడ్డి పార్టీ మార్పు వార్తలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు.

జీవన్ రెడ్డి పార్టీ మారబోడు అనే ఆశతో ఉన్నాం: మంత్రి అడ్లూరి
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జీవన్ రెడ్డి పార్టీ మార్పు వార్తలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. సోమవారం కేబినెట్ భేటీ అనంతరం అడ్లూరి లక్ష్మణ్ కమార్ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్‌లో తమకు జీవన్ రెడ్డే పెద్ద దిక్కు అని అన్నారు. కాంగ్రెస్‌తో నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఆయనకు ఉంది. కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి ఆస్తి. అలాంటి వ్యక్తి పార్టీ మారబోడు అనే ఆశతోనే ఉన్నాం అని అడ్లూరి లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. ఇక తాను కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగలేను అంటూ జగిత్యాల నియోజకవర్గంలోని కార్యకర్తలకు ఇటీవల జీవన్ రెడ్డి లేఖ రాశారు. ఈనెల 25వ తేదీన కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తానని కార్యకర్తలకు రాసిన లేఖలో జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. గత 20 నెలలుగా కాంగ్రెస్ పార్టీలో తాను తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నానని పేర్కొన్నారు. రోజురోజుకూ తనకు ఎదురవుతున్న అవమానాలను భరిస్తూ ఇంకా హస్తం పార్టీలో కొనసాగలేనని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో జీవన్ రెడ్డిపై మంత్రి అడ్లూరి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Next Story