4 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం ఆ రెండు కూడా చేస్తాం.. గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి

by Ajay Maddhiboyina |

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు జరుగుతున్నాయి. ప్రజలు, నాయకులు పండుగను ఎంతో సంబురంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాయకులు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు చెబుతున్నారు.

4 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం ఆ రెండు కూడా చేస్తాం.. గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబురాలు జరుగుతున్నాయి. ప్రజలు, నాయకులు పండుగను ఎంతో సంబురంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాయకులు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంతా సంతోషంగా ఉండాలన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా తనపై శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆశీస్సులు ఉండాలని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని చెప్పారు. మిగిలిన రెండు గ్యారెంటీలను సైతం అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.

Next Story