- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మేము దండుపాళ్యం బ్యాచ్ అయితే మీరు స్టూవర్ట్ పురం దొంగలా?: అడ్లూరి
కేసీఆర్ కు తెలియకుండా సీక్రెట్ గా 28 మంది ఎమ్మెల్యేలకు హరీశ్ రావు ఫండింగ్ చేశారని మంత్రి అడ్లూరి ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: కేసీఆర్ కు తెలియకుండా హరీశ్ రావు 28 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేశారని, అందువల్లే రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా హరీశ్ రావుకు (Harish Rao) కేసీఆర్ వెంటనే మంత్రి పదవి ఇవ్వలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Lakshman) ఆరోపించారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన అడ్లూరి.. హరీశ్ రావు నోటికి ఎంతొస్తే అంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని బలహీన వర్గాల మంత్రులు ఉన్న కేబినెట్ ను దండుపాళ్యం బ్యాచ్ అని హరీశ్ రావు ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి వర్గం దండుపాళ్యం బ్యాచ్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రివర్గం స్టువర్ట్ పురం దొంగలా అని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్న కేబినెట్‍పై చేసిన వ్యాఖ్యలకు గాను హరీశ్ రావు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీశ్ రావు అవినీతికి పాల్పడ్డారంటూ కవిత చేసిన ఆరోపణలపై చర్చకు రమ్మంటే తొక ముడిచిన హరీశ్ రావు.. ఇప్పుడు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను చర్చకు పంపుతానంటున్నారని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు చర్చకు రావడానికి మేము సిద్ధమేనన్నారు. కేసీఆర్ మీ అల్లుడ్ని కంట్రోల్‍లో పెట్టుకోవాలని సూచించారు.






