- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నెలాఖరుకల్లా మున్సిపోల్స్ నోటిఫికేషన్: మంత్రి అడ్లూరి
ఫిబ్రవరి నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఉపాధి హామీ పథకంపై చర్చ సందర్భంగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తుందన్న భయంతోనే బీఆర్ఎస్ సభకు రావడం లేదు..మామ సభలో కోట్లాడు అని చెప్పి పంపిస్తే, అల్లుడు సభ నుంచి బయటకు వెళ్లిపోయాడు..సభను బహిష్కరించి వెళ్లే అంశమే సభలో జరగలేదని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం బీఆర్‌ఎస్ నేతలకు లేదని, నరేగా పథకంపై మాట్లాడలేక, బీజేపీపై విమర్శలు చేయలేక సభను వదిలి వెళ్లారని విమర్శించారు. నీళ్లపై చర్చ అని చెప్పగానే సభ నుంచి బీఆర్ఎస్ నేతలు పారిపోయారని, సభలో చర్చలో పాల్గొనకుండా, బయట ఎంత చెప్పినా అది వృథానే అని ఆయన తెలిపారు.
గత రెండు సంవత్సరాలుగా వారి వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని, తమ పంతం నెగ్గించుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. పేదల పథకాలపై మాట్లాడే ఆసక్తి వారికి లేదని, మా తప్పులు ఉంటే అసెంబ్లీలో నిరూపించండి అని సవాల్ విసిరారు. మూసీ అంశంలో మీరే రన్నింగ్ కామెంటరీ చేసిన విషయం అందరికీ తెలుసని, బీఆర్‌ఎస్ పార్టీ ఖతమయ్యే దశకు చేరుకుంది .. ఉనికిని కాపాడుకునే ప్రయత్నమే మిగిలిందని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. గతంలో వారు తమ ఎమ్మెల్యేలకు కూడా సభలో కనీస గౌరవం ఇవ్వలేదని మండిపడ్డారు. సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల విద్యార్థులకు వేడి నీటి సౌకర్యం కోసం సోలార్ పవర్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈ నెలాఖరు కల్లా మున్సిపాలిటీల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, ఫిబ్రవరి నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయన్నారు.






