- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్‌కు పౌరుషం ఉంటే..: మంత్రి సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ.. దోచుకో.. దాచుకో అనేది బీఆర్ఎస్ సిద్ధాంతం అని విమర్శించారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ.. దోచుకో.. దాచుకో అనేది బీఆర్ఎస్ సిద్ధాంతం అని విమర్శించారు. అసూయతోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయడం కేటీఆర్ మానుకోవాలని హితవు పలికారు. కేటీఆర్‌కు పౌరుషం ఉంటే ముందు కవిత ప్రశ్నలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చర్చకు సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. నిరుద్యోగుల ఉసురు తగిలి బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిందన్నారు. కాగా, తెలంగాణలో ఏం సాధించారని పార్టీ పేరు మార్చుకుని దేశమంతా తిరిగారని గతంలో శాసనమండలి వేదికగా కవిత బీఆర్ఎస్‌ను ప్రశ్నించిన విషయం తెలిసిందే. తెలంగాణలో సొంత రైతులు చనిపోతే పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం.. పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర రైతులకు ఇక్కడి నిధులు ఎలా పంపిణీ చేసిందని కవిత నిలదీశారు. ఇప్పుడు ఇదే విషయాన్ని స్వయంగా మంత్రి గుర్తుచేయడం హాట్ టాపిక్‌గా మారింది.






