కేటీఆర్‌ ఏ పనీ చేయలేదు కాబట్టే, చెప్పుకునే మొహం లేదు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-25 10:33:17  IST  )

కేటీఆర్ ఏ ప‌ని చేయ‌లేదు కాబ‌ట్టే చెప్పుకునే మొహం లేద‌ని మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ విమ‌ర్శించారు. ఆయ‌న‌వ‌న్నీ తుపాకి రాజ‌న్న ముచ్చ‌ట్లు ఉంటాయ‌ని అన్నారు.

కేటీఆర్‌ ఏ పనీ చేయలేదు కాబట్టే, చెప్పుకునే మొహం లేదు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
X

దిశ‌, వెబ్ డెస్క్: కేటీఆర్ ఏ ప‌ని చేయ‌లేదు కాబ‌ట్టే చెప్పుకునే మొహం లేద‌ని మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ విమ‌ర్శించారు. ఆయ‌న‌వ‌న్నీ తుపాకి రాజ‌న్న ముచ్చ‌ట్లు ఉంటాయ‌ని అన్నారు. ప్ర‌భుత్వం ఏదైనా చేసిన ప‌నులు చెప్పుకుంటుంద‌ని, చేసిన ప‌నులు చెప్పుకోవ‌డంలో త‌ప్పులేదని అన్నారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట మీరు ఏనాడైనా నెర‌వేర్చేరా అని ప్ర‌శ్నించారు. ఒక్క రేష‌న్ కార్డు, ఇందిర‌మ్మ ఇల్లు, క‌రెంట్ ఫ్రీ, ఉచిత బ‌స్, నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు ఎన్నడైనా ఇచ్చారా అని ప్ర‌శ్నించారు.

ఇదివ‌ర‌కు కేసీఆర్ రాజ్యమే ఉన్న‌ద‌ని, మీరు సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తే ఎవ‌రైనా వ‌ద్ద‌ని అన్నారా అంటూ నిల‌దీశారు. పేద‌వాళ్ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని, మీకెన్న‌డైనా పేద‌వాళ్ల‌కు స‌న్న‌బియ్యం ఇవ్వాల‌నే ఆలోచ‌న వ‌చ్చిందా అని అడిగారు. ఈ రోజు పిలిచి మ‌రీ రేష‌న్ కార్డు ఇచ్చి స‌న్న‌బియ్యం ఇస్తున్నామ‌ని చెప్పారు. అంతే కాకుండా పుష్క‌రాల లోపు ధ‌ర్మ‌పురి ఆల‌యాన్ని మ‌రింత అభివృద్ధి చేస్తామ‌ని అన్నారు. భ‌క్తుల కోసం మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. రూ. 2 కోట్ల‌తో దుకాణాల స‌ముదాయాన్ని, నాగ‌య్య దేవాల‌యాన్ని నిర్మిస్తామ‌ని అన్నారు. ఆల‌య అభివృద్ధి ప‌నుల‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి త్వ‌ర‌లోనే మాస్ట‌ర్ ప్లాన్ సిద్ధం చేస్తామ‌ని చెప్పారు.

Next Story