- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టైమ్ చెబితే కోరుట్లకు వస్తా.. కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్
by Ramesh Naini |
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇందిరమ్మ పుట్టినరోజు సందర్భంగా మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చీరల పంపిణీ చేయడం ఇష్టం లేదా? అని నిలదీశారు. మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇవ్వడం బీఆర్ఎస్ నేతలకు ఇష్టం లేదని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం అభివృద్ధి జరిగింది, రెండేళ్ల ప్రజా పాలనలో జరిగిన అభివృద్ధిపై చర్చిద్దామని అన్నారు. ఈ మేరకు కేటీఆర్ డేట్, టైమ్ చెబితే కోరుట్ల అంబేద్కర్ విగ్రహం వద్దకు వస్తా అని ఛాలెంజ్ చేశారు. ఏమి అభివృద్ధి జరిగిందో లెక్కలతో సహా చెబుతానని వెల్లడించారు. 2014 నుంచి 2023 వరకు ఎలాంటి అభివృద్ధి జరిగిందో వివరిస్తామని చెప్పారు.
Next Story






