జూబ్లీహిల్స్ బై‌ పోల్‌కు ఎంఐఎం దూరం.. అధికార పార్టీకి సపోర్టు?

by Kema Shiva Kumar |

జూబ్లీహిల్స్ ​ఉప ఎన్నికల్లో పోటీకి ఎంఐఎం దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జూబ్లీహిల్స్ బై‌ పోల్‌కు ఎంఐఎం దూరం.. అధికార పార్టీకి సపోర్టు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ​ఉప ఎన్నికల్లో పోటీకి ఎంఐఎం దూరంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో కాంగ్రెస్‌కు మజ్లిస్​పార్టీ మద్దతు ఇస్తుందన్న ప్రచారం ఊపందుకున్నది. నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్​యాదవ్ 2014లో ఎంఐఎం నుంచి పోటీ చేయగా 41,656 ఓట్లు వచ్చాయి. మాగంటి గోపీనాథ్‌కు నవీన్​యాదవ్​గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. పార్టీకి సుమారు 4.28 శాతం ఓట్లు తెచ్చుకున్నారు. ఆ ఎన్నికలో కాంగ్రెస్​తరఫున అజారుద్దీన్‌కు గణనీయమైన స్థాయిలో ఓట్లు పడ్డాయి. అయితే తాజాగా జూబ్లీహిల్స్​ఉపఎన్నికలో మజ్లిస్​పోటీ చేయకపోవడంతో కాంగ్రెస్‌తో మైత్రి కుదిరిందన్న టాక్​వినిపిస్తున్నది. ఇదే జరిగితే అధికారపార్టీకి పెద్ద మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటు గ్రేటర్​ఎన్నికలు కూడా ఆర్నెళ్లలోగా షెడ్యూల్ ప్రకారం జరగనున్నాయి. అయితే గ్రేటర్‌లో కాంగ్రెస్​గత అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పుకోదగిన ఫలితాలను సాధించలేకపోయింది. కంటోన్నెంట్‌లో ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్​విజయం సాధించింది. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లోనూ గెలిస్తే గ్రేటర్ లో ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఎంఐఎంతో కాంగ్రెస్​దోస్తీ ఏ మేరకు కలిసి వస్తుందో వేచిచూడాలి.

Next Story