- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: మధ్యాహ్న భోజన పథకం నిధులు విడుదల
by Gantepaka Srikanth |
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం నిధులు విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం నిధులు విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం కింద ఒకటి నుండి ఎనిమిదో తరగతి విద్యార్థులకు వంట ఖర్చులు, వంట సహాయకుల గౌరవ వేతనం కోసం నిధుల మొత్తాన్ని విడుదల చేశారు. విడుదల చేసిన మొత్తం నిధులు రూ. 51,78,88,960 రూపాయలు ఈ ఏడాది ఏప్రిల్, జూన్ వరకు ఒక్కో జిల్లాకు రూ.1000 చొప్పున మంజూరు చేసింది. సింగిల్ నోడల్ ఏజెన్సీ ద్వారా ఈ నిధులు జిల్లాలకు చేరతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీని ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో చేపట్టిన పీఎం పోషన్ పథకం మరింత పటిష్టంగా అమలు అవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నిధుల విడుదల పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సజావుగా సాగడానికి తోడ్పడన్నాయి.
Next Story






