- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: ఆస్పత్రిలో 40 మంది విద్యార్థులు.. ఆరుగురి పరిస్థితి విషమం
TG: ఆస్పత్రిలో 40 మంది విద్యార్థులు.. ఆరుగురి పరిస్థితి విషమం

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని చందునాయక్‌తండా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కొండాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించి విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. విషమంగా ఉన్న ఆరుగురిని స్థానిక ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అన్నం ఉడకలేదు.. కూరలు అస్సలు బాగో లేవు.. అదే మీ పిలల్లకైతే ఇలాగే పెడతారా.. అంటూ ఇటీవలే రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు గంజిమాల దేవి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాలువపల్లి ఉన్నత పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ నిర్లక్ష్యం జరిగినా ఊరుకోము అని హెచ్చరికలు జారీ చేశారు. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రావడం లేదని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.






