మూసీ ఉగ్రరూపం.. జల దిగ్భందంలో ఎంజీబీఎస్ బస్‌స్టాండ్

by Malleboina Mahesh |   (  Updated:2025-09-27 02:33:02  IST  )

బంగాళఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

మూసీ ఉగ్రరూపం.. జల దిగ్భందంలో ఎంజీబీఎస్ బస్‌స్టాండ్
X

దిశ, వెబ్ డెస్క్: బంగాళఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు జంట జలాశయాలు (Twin reservoirs) నిండుకుండలా మారిపోవడంతో అప్రమత్తం అయిన అధికారులు హిమాయత్ సాగర్ (Himayat Sagar), ఉస్మాన్ సాగర్ (Usman Sagar) గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో.. మూసీ నది (Musi River) నగరంలో ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది. దీంతో హైదరాబాద్ నగరానికి అత్యంత కీలకమైన ఎంజీబీఎస్ బస్ స్టాండ్ (MGBS Bus Stand) వద్ద మూసీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. రాత్రి 7 గంటల వరకు అంతా సాఫీగా సాగిన 9 తర్వాత ఒక్కసారిగా బస్ స్టాండ్ చుట్టూ వరద చుట్టేసింది. దీంతో వందల మంది ప్రయాణికులు, బస్సులు నీటిలో చిక్కుకొని పోయాయి.

అయితే ముందస్తుగానే వరదను గమనించిన పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది (RTC staff), వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను దూర ప్రాంతాల్లోనే నిలిపివేశారు. ఇదిలా ఉంటే వరద వేగంగా పెరుగుతుండటంతో ఇప్పటికే ఎంజీబీఎస్ బస్ స్టాప్ (MGBS Bus Stop)లో ఉన్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరద పోటెత్తడం, ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో మూసీ పరివాహక ప్రాంత (Musi catchment area) ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. కాగా భారీ వరదలు (Heavy floods) వస్తున్న క్రమంలో అప్రమత్తం అయిన ప్రభుత్వ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తుంది.

Read More..

MGBSలోకి చేరిన మూసీ వరద నీరు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Next Story