- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MGBSలోకి చేరిన మూసీ వరద నీరు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
కుండపోత వర్షాలతో మూసీ ఉగ్రరూపం దాల్చింది.

దిశ, వెబ్‌డెస్క్: కుండపోత వర్షాలతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో అధికారులు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో పురానాపూల్-జియాగూడ 100 ఫీట్ రోడ్డును పోలీసులు తాత్కలికంగా మూసి వేశారు. ఇక ఛాదర్‌ఘాట్ లోయర్ బ్రిడ్జిపై నీరు 6 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది. అదేవిధంగా మూసారాంబాగ్ వంతెనపై 10 అడుగుల మేర వదర నీరు అత్యంత భయానకంగా వెళ్తోంది. బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా స్లాబ్ వేసేందుకు సిద్ధం చేసిన నిర్మాణ సామాగ్రి కూడా వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో ఆ వంతెనలను ట్రాఫిక్ పోలీసులు మూసి వేసి బారీకేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ప్రాంతాల్లో వాహనాదారులు ఎటు వెళ్లాలో తెలియక భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి
ఎంజీబీఎస్ వద్ద ప్రమాదకర స్థాయిలో మూసీ నీది ప్రవహిస్తోంది. ఏకంగా బస్ స్టేషన్ (MGBS)లోని భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ పరిణామంతో వేల మంది ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు వెళ్లేందుకు పడిగాపులు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎంజీబీఎస్ నుంచి ప్రయాణికులను వెంటనే మరోచోటికి తరలించాలని సూచించారు. వరద నీటిలో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా బయటకు తీసుకురావాలన్నారు. పోలీసులు, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్‌కు వచ్చే బస్సులను ప్రత్యామ్నాయ రూట్లకు మళ్లించాలని అధికారులను ఆదేశించారు. బతుకమ్మ, దసరా పండుగల వేళ కావటంతో వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఆర్టీసీ విభాగం తగిన చర్యలు చేపట్టాలన్నారు. సిటీలో నీళ్లు నిలిచే ప్రాంతాలు, మూసీ ప్రమాదకరంగా ప్రవహించే ప్రాంతాల్లో ప్రజలు వెళ్లకుండా అధికారులు హెచ్చరించేలా బోర్డులు పెట్టాలని, అటు వైపు వాహనాలు, ప్రజలు వెళ్లకుండా దారి మళ్లించాలని సూచించారు. ఇక మూసీ వెంట లోతట్టు ప్రాంతాలన్నింటా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
ఎంజీబీఎస్‌లో పరిస్థితి ఇలా.. (ఫొటోలు)
Read More..






