కేటీఆర్ అనైతిక రాజకీయాలు చేస్తున్నారు : మెట్టు సాయి కుమార్

by Ramesh Naini |

కేటీఆర్ తెలంగాణలో అనైతిక రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ఫిషరీస్​ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మండిపడ్డారు.

కేటీఆర్ అనైతిక రాజకీయాలు చేస్తున్నారు : మెట్టు సాయి కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేటీఆర్ తెలంగాణలో అనైతిక రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ఫిషరీస్​ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో బీఆర్ఎస్ చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్ అయ్యారని, క్యాతనపల్లిలో బీఆర్ఎస్ దౌర్జన్యాలకు పాల్పడి సీపీఐ పార్టీ మద్దతు ఇస్తే గెలిచిందన్నారు.

2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి అయ్యాయని, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పని చేశాయని మెట్టు సాయి కుమార్ ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Next Story