హైదరాబాద్‌లో మెట్రో సేవలకు అంతరాయం

by velandi.Saikiran |

హైదరాబాద్ ( Hyderabad) మెట్రో ( Metro) ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్ లో మెట్రో సేవలకు ఇవాళ

హైదరాబాద్‌లో మెట్రో సేవలకు అంతరాయం
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ ( Hyderabad) మెట్రో ( Metro) ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్ లో మెట్రో సేవలకు ఇవాళ అంతరాయం కలిగింది. దీంతో... మెట్రో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. సాంకేతిక సమస్యల కారణంగా హైదరాబాద్ మెట్రో రైలు ( Metro Train) ఆగిపోయింది. మియాపూర్ ( Miyapur) నుంచి ఎల్బీనగర్ ( Lb nagar) రూట్ లో వెళ్తున్న మెట్రో రైలు సాంకేతిక కారణం వల్ల... మధ్యలోనే నిలిచిపోయింది.

దీంతో మెట్రో రైలులో ఉన్న ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. దాదాపు 20 నిమిషాల పాటు భరత్ నగర్ లోనే ( Bharath nagar) మెట్రో రైలు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో వెంటనే రంగంలోకి దిగిన మెట్రో అధికారులు... అక్కడి సమస్యను పరిష్కరించి... మెట్రో రైలును బాగు చేశారు. 20 నిమిషాల తర్వాత ఆ మెట్రో రైలు కదిలినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story