- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టూడెంట్స్‌కు మెట్రో రైలు పాసులు ఇవ్వాలి: SFI డిమాండ్
హైదరాబాద్ మెట్రో రైలులో విద్యార్థులకు రాయితీతో కూడిన పాసులు ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రో రైలులో విద్యార్థులకు రాయితీతో కూడిన పాసులు ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. కాలేజీలకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారని, సమయం తగ్గించుకుని చదువులపై ఫోకస్ పెట్టాలంటే విద్యార్థులకు మెట్రో పాసులు ఇవ్వాలని వారు పేర్కొన్నారు. స్టూడెంట్స్‌కు పాస్ ఇవ్వాలని బుధవారం నిజాం కళాశాలలో, నాంపల్లి, అసెంబ్లీ మెట్రో స్టేషన్ల వద్ద ఎస్ఎఫ్ఐ లీడర్లు సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీమన్ నాయక్ మట్లాడుతూ.. నగరంలో ప్రతిరోజు వేలాది మంది విద్యార్థులు బస్సుల్లో వెళ్లి ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారన్నారు. దీంతో దూరంగా కాలేజీలు ఉన్న విద్యార్థులు మెట్రోలో రాకపోకలు సాగిస్తున్నారని, వారికి సబ్సిడీతో పాసులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంతకాల సేకరణలో ఎస్ఎఫ్ఐ నాయకులు కౌశిక్, వినయ్ కృష్ణ తదితరులు ఉన్నారు.






