- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రానికి మెట్రో DPRను పూర్తి స్థాయిలో పంపలేదు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ మెట్రో రైలు (HMR) సెకండ్ ఫేజ్ పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు వివిధ బ్యాంకుల రుణాలతో, పీపీపీ విధానంలో చేపట్టబోతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మెట్రో రైలు (HMR) సెకండ్ ఫేజ్ పనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు వివిధ బ్యాంకుల రుణాలతో, పీపీపీ విధానంలో చేపట్టబోతున్నారు. ఆ పనులకు గాను ఇప్పటికే రూ.19 వేల కోట్ల నిధులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. మొత్తం మూడు మార్గాల్లో 86.5 కి.మీ.మేర ట్రాక్ నిర్మాణానికి ప్రతిపాదించగా.. అందుకు సంబంధించి డీపీఆర్ (DPR)కు సీఎస్ నేతృత్వంలోని హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్ (HAML) బోర్డు కూడా ఆమోదం తెలిపింది.
ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్‌లో కేంద్ర కిషన్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడుతూ.. మెట్రో రైలు డీపీఆర్ (Metro Rail DPR)పై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ (Telangana)తో పాటు హైదరాబాద్ (Hyderabad) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అదేవిధంగా హైదరాబాద్ మెట్రో రైలు సెకండ్ ఫేజ్‌కు సంబంధించి పూర్తి స్థాయి డీపీఆర్ (DPR)ను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కేంద్రానికి పంపలేదని స్పష్టం చేశారు. సమగ్రంగా డీఆర్ఆర్‌ను సిద్ధం చేసి పంపితే.. కేంద్ర కేబినెట్ భేటీలో మెట్రో సెకండ్ ఫేజ్ ప్రాజెక్ట్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. హైదరాబాద్ సమగ్రాభివృద్ధి నేతలంతా కలిసికట్టుగా పని చేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.






