- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mepma: జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన.. మెప్మా ఉద్యోగుల ముందస్తు అరెస్ట్
మెప్మా ఆర్పీ ఉద్యోగులను(Metma RP Employees) ఇబ్రహీం పట్నం పోలీసులు(Ibrahim Patnam Police) హౌజ్ అరెస్ట్(House Arrest) చేశారు.

దిశ, వెబ్ డెస్క్: మెప్మా ఆర్పీ ఉద్యోగులను(Metma RP Employees) ఇబ్రహీం పట్నం పోలీసులు(Ibrahim Patnam Police) హౌజ్ అరెస్ట్(House Arrest) చేశారు. రంగారెడ్డి జిల్లా(Rangareddy District) ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏడు నెలలుగా జీతాలు రావడం లేదని, మెప్మా ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేసుకొని, జిల్లా అధికారులను కలవాలని ఉద్యోగులు పిలుపునిచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు మెప్మా ఉద్యోగులను ముందస్తు హౌజ్ అరెస్ట్ చేశారు. అనంతరం ఇబ్రహీం పట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై మెప్మా ఉద్యోగులు మాట్లాడుతూ.. తమను ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదని, తాము జీతాలు రావట్లేదని అధికారులకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళుతుంటే అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమ జీతాలు 10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారని, కానీ ఉన్న జీతాలు కూడా 7 నెలల నుంచి చెల్లించడం లేదని, పైగా మమ్మల్ని అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు.






