- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాతావరణ శాఖ హెచ్చరిక.. రాగల మూడు రోజుల పాటు ఈ జిల్లాల్లో వర్షాలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రోజురోజుకు ఎండలు తీవ్రత పెరుగుతుంది. ఓవైపు ఎండలు, మరోవైపు తీవ్ర వడగాలుల నేపథ్యంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురవడంతో ప్రజలకు కొంత ఉపశమనం కలిగించింది. కానీ.. కురిసిన ఈ అకాల వర్షాలు రైతన్నలకు దు:ఖాన్ని మిగిల్చాయి. అకాల వర్షాల వల్ల చేతికి అందివచ్చిన పంట నేలపాలు కావడంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే.. గత కొన్ని రోజుల నుంచి వాతావరణం(weather)లో భిన్నమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతుంటే.. మరికొన్ని చోట్ల వర్షాలు(Rains) పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్(Hyderabad) వాతావరణ శాఖ(Department of Meteorology) మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ(Telangana)లో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇవాళ, రేపు ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, హైదరబాద్‌తో పాటు రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక, రాగల నాలుగు రోజులు పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందంటున్న వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. అయితే వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు గమనిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.






