- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ కీలక ప్రకటన
రాష్ట్రంలో నేడు పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నేడు పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్ర తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ ఆవర్తనం సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఉత్తర, వాయువ్య దిశల నుండి గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. నేడు రాష్ర్టంలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ ,హన్మకొండ, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం పేర్కొంటూ ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఖమ్మం జిల్లా కారేపల్లిలో అత్యధికంగా 7 సెం.మీ లవర్షం :
రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. నాగర్ కరన్నూల్ జిల్లా పెద్దూర్ లో 7 సెం.మీ, రంగారెడ్డి జిల్లా చుక్కాపూర్ లో 6.5 సెం.మీ, వికారాబాద్ జిల్లా బషీరాబాద్ లో 6.4 సెం.మీ, నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో 5.5 సెం.మీ, వికారాబాద్ జిల్లా చౌదాపూర్ లో 5.2 సెం.మీ, రంగారెడ్డి జిల్లా తొమ్మిడిరేకులలో 5 సెం.మీ చొప్పున వర్షాపాతం నమోదైంది.ల






