- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో వర్షాలు.. రేపు ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ
రాష్ట్రంలో పలు జిల్లాల్లో సోమవారం అత్యధిక వర్షాపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పలు జిల్లాల్లో సోమవారం అత్యధిక వర్షాపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 9 సెం.మీ వర్షం కురిసింది. అలాగే మంగళవారం, బుధవారం కూడా గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
చల్లబడ్డ వాతావరణం:
రాష్ట్రంలో రుతుపవనాలు వేగం పుంజుకున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావ్రుతమై వాతావరణం చల్లబడింది. మరికొన్ని ప్రాంతాలలో వర్షం కురిసింది. సోమవారం నమోదైన వర్షాపాతం: కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో 9 సెం.మీ, సదాశివ నగర్‌లో 8 సెం.మీ, జుక్కల్ లో 7 సెం.మీ, కామారెడ్డిలో 7 సెం.మీ, బిర్కూర్‌లో 6 సెం.మీ, నిజామాబాద్ జిల్లా బోధన్ లో 6 సెం.మీ, కామారెడ్డి జిల్లా రెడ్డిపేట్2లో 5 సెం.మీ, జగిత్యాల జిల్లా కత్లాపూర్‌లో 5 సెం.మీ, నిజామాబాద్ జిల్లా నవీపేట్ లో 5 సెం.మీ, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి లో 5 సెం.మీ, చొప్పున వర్షాపాతం నమోదైంది.






